సినీ నటుడిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రాజకీయాలలో ఎంతో బిజీగా అయ్యారు.ఇక రాజకీయాలలో కూడా ఈయన సక్సెస్ కావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనగా మారారు.ఈయన మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎంగా( Deputy CM ) కూడా బాధ్యతలు తీసుకోవడంతో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఈయన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఇలా సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ యాంకర్ స్రవంతి చొక్కారపు ( sravanthi chokkarapu )కూడా ఒకరు.ఈమె పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.
పవన్ అంటే ఎంత ఇష్టమో అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం అని వెల్లడించారు.ఇక పవన్ పై ఉన్నటువంటి అభిమానంతోనే తన కుమారుడికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ( Akira Nandan )పేరును పెట్టుకున్నట్లు తెలియజేశారు.ఇక తన కొడుకుకి పవన్ కొడుకు పేరును పెట్టడమే కాకుండా తన బోటిక్ కి కూడా అకీరా లేబిల్ ( Akira Label )అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.అంతేకాకుండా తన బోటిక్ నుంచి పవన్ కళ్యాణ్ కు కొన్ని ఔట్ ఫిట్స్ పంపానని, వాటిని ఆయన వేసుకోవడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని స్రవంతి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ పై ఇంత అభిమానం ఉన్నప్పటికీ ఇంతవరకు ఈమె ఆయనని నేరుగా కలవలేదని త్వరలోనే కలుస్తాను అంటూ పవన్ పై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.