ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలకు( Power Cuts ) సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా ప్రజలు తెలుసుకుంటూనే ఉంటున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతల విషయంపై అనేకసార్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
అంతేకాదు పట్టణ, నగరాలలో కూడా కరెంటు కోతలు ఎక్కువ అయితున్నాయి అంటూ ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంఘటనలు కూడా లేకపోలేదు.అయితే తాజాగా కరెంటు కోతలపై కరెంట్ అధికారులతో ఓ రైతు( Farmer ) ఫోన్లో మాట్లాడిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో రైతు అధికారులతో ఏ విధంగా మాట్లాడడన్న విషయం గురించి చూస్తే.
ప్రస్తుతం వారి ప్రాంతంలో జరుగుతున్న కరెంటు కోతలపై హనుమకొండ జిల్లా( Hanumakonda District ) ధర్మసాగర్ మండలం రైతు ఏశబోయిన కుమారస్వామి అనే ప్రౌలిటీ రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.వర్షం పడిన ప్రతిసారి కరెంటు తీస్తున్నారని దానివల్ల తమ ఫామ్ కు కరెంటు ఇవ్వకుండా కేవలం ఇళ్లకు మాత్రమే కరెంటు ఇస్తూ తమను నష్టపోయేలా చేస్తున్నట్లు అతడు వాపోయాడు.కరెంటు లేకపోవడంతో కోడి పిల్లలు చనిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని అతడు విద్యుత్ అధికారులతో సంభాసించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సదరు పౌల్ట్రీ రైతు ( Poultry Farmer ) విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ప్రతినెల కోళ్లు ఇస్తున్న తమకు ఎందుకు కరెంటు తీస్తున్నారో సమాధానం చెప్పాలంటూ అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.ప్రతినెల తప్పనిసరిగా అధికారులకు కోళ్లను ఇస్తున్న తమకు కరెంటు తీసేయడంపై ఆగ్రహించిన సదరు కోళ్ల ఫారం యజమాని కరెంట్ అధికారులను నిలదీశాడు.తాను ఈ కాల్ సంభాషణను వీడియో రికార్డ్ కూడా చేస్తున్నట్లు అతను అధికారులకు తెలపడం వీడియోలో గమనించవచ్చు.ఈ విషయం బట్టి చూస్తే.ప్రస్తుతం రాష్ట్రంలో పవర్ కట్ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.