హెయిర్ ఫాల్ నుంచి చుండ్రు వరకు అన్ని సమస్యలకు చెక్ పెట్టె ఆముదం.. ఎలా వాడాలంటే?

ఆముదం.( Castor Oil ) నూనెల్లో ఇది ఒక రకం.ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు.

దాదాపు అందరికీ ఆముదం నూనె అందుబాటులో ఉంటుంది.

కానీ ఆముదాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు.అయితే నిజానికి ఆముదం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఆముదం ఎంతో బాగా సహాయపడుతుంది.

అనేక జుట్టు సంబంధిత సమస్యలకు ఆముదంతో సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆముదంను ఏ సమస్యకు ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఫాల్.( Hairfall ) చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.అయితే హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నవారు ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

Advertisement

ఈ ఆయిల్ ను స్లైట్ గా హీట్ చేసి నైట్ నిద్రించేముందు స్కాల్ప్ కు అప్లై చేసుకుని కనీసం ప‌ది నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అలాగే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగాలి అంటే ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, వ‌న్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు పట్టించి గంట లేదా రెండు గంటల అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

చుండ్రు( Dandruff )తో బాధపడేవారు రెండు టేబుల్ స్పూన్ల ఆముదంలో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకోవాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.ఇక సిల్కీ హెయిర్( Silky Hair ) కోసం ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్లు అరటి పండు పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి మిక్స్ చేయాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.అలాగే జుట్టు చిట్లడం విరగడం వంటివి సైతం తగ్గుతాయి.

ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు