ఎట్టకేలకు నటుడు గౌతమ్ కార్తీక్ నటి మంజీమా మోహన్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.దేవరట్టంసినిమా ద్వారా వీరిద్దరూ కలిసి నటించడంతో ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఇలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ జంట ఎన్నో సంవత్సరాలనుంచి రహస్యంగా ప్రేమలో ఉంటూ ప్రేమ పక్షులుగా విహరించారు.అయితే గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారకంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా వీరి ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా వీరి పెళ్లికి కూడా ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు.ఇకపోతే ఇన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు నేడు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఎంతో ఘనంగా అందరి సమక్షంలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే పెళ్లి దుస్తులలో ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం వీరికి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక గౌతమ్ కార్తీక కడలి సినిమా ద్వారా హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
ఇక మంజీమా మోహన్ సైతం నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.