ఏడాది కిందట టాలీవుడ్ లో తమ విడాకులతో సంచలనం రేపారు సమంత, నాగచైతన్య( Samantha, Naga Chaitanya ).ఏ కారణంతో విడిపోయారో తెలియదు కానీ అప్పట్లో వీరి వీడాకుల గురించి నానా రకాల వార్తలైతే వచ్చాయి.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరి విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంది.ఏ ఒక్కరు కూడా ఈ జంట ఎందుకు విడిపోయారన్న విషయం గురించి మాత్రం అస్సలు వదలట్లేరు.
ఎందుకంటే విడాకుల( divorce ) ముందు ఈ జంట ఎంతలా అన్యోన్యంగా ఉన్నారో చూసాం.అంతేకాదు కొంతకాలం ప్రేమలో ఉండి కుటుంబ సభ్యులకు ఒప్పించి మరి గ్రాండ్ గా పెళ్లి జరుపుకున్నారు.
పెళ్లి తర్వాత కూడా ఇద్దరు కలిసి నటించారు.అంతేకాకుండా తమ అన్యోన్యత అందరి దృష్టిలో పడేటట్టు చేశారు.
ఇద్దరు కలిసి అడ్వర్టైజ్ చేయటం, వెకేషన్స్ అంటూ తిరగటం, బాగా ఫోటో షూట్ లు చేయించుకోవటం ఇలా ఒకటి కాదు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి అందరి దృష్టిలో పడ్డారు.
పైగా ఒకరికొకరు బాగా ప్రేమ కూడా చూపించుకున్నారు.కెమెరా ముందు వచ్చి ఇద్దరూ ఒకరికొకరి గురించి చాలా విషయాలు పంచుకున్నారు.అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీలో కూడా సమంత బాగా కలిసిపోయింది.
అటువంటిది ఒకేసారి ఈ జంట విడాకులని అనటంతో టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.వీరు విడాకుల గురించి చెప్పక ముందే సోషల్ మీడియాలో అన్ ఫాలో కావటం.
పెళ్లి ఫోటోలు డిలీట్ చేయటం.
సమంత నాగచైతన్యకు దూరంగా ఉండటం ఇలా కొన్ని క్లూస్ రావడంతో వీరిద్దరు విడిపోతున్నారు అని జనాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు చేసుకున్నారు.అలా వీరిద్దరు ఏ కారణంతో విడిపోయారు అనేది మాత్రం కొంతకాలం వరకూ చర్చ నడుస్తూనే వచ్చింది.అంతేకాకుండా ఆ సమయంలో విడాకులకు కారణం.
సమంత అక్కినేని ఫ్యామిలీకి( Akkineni family ) ఎదురించి మాట్లాడిందని, సమంత తీరు అమలకు, నాగచైతన్యకు నచ్చలేదని.సమంత క్లివేజ్ షో చేయటం వల్ల అని ఇలా నానా రకాలుగా వీరికి విడాకులు జరిగాయని బాగా వార్తలతో వచ్చాయి.
కానీ ఏ రోజు కూడా అటు సమంత కానీ, ఇటు నాగచైతన్య కానీ ఈ విషయం గురించి బయటికి చెప్పలేదు.
వారిపై ఎన్ని రకాల కామెంట్లు వచ్చినా కూడా సైలెంట్ గానే ఉన్నారు.కానీ రీసెంట్ గా తమ విడాకుల గురించి చైతూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరిచే విమర్శలు ఎదురుకుంటున్నాడు.అయితే ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే.
నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో.
సమంతతో విడాకులు తీసుకుంది కేవలం సోషల్ మీడియాలో ( social media )వచ్చిన పుకార్ల కారణంగానే అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు.దీంతో ఆయనపై ఆయన అభిమానులే కాదు నెటిజన్స్ కూడా బాగా ఫైర్ అవుతున్నారు.
కేవలం సోషల్ మీడియాలో వచ్చే కారణాలవల్లే విడాకులు తీసుకోవడానికి మీరు ఏమైనా చిన్నపిల్లలా అంటూ.ఆ మాత్రం ఆలోచన లేకుండా సోషల్ మీడియా కామెంట్స్ లో ఎలా నింద వేస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు.
మరి కొంత మంది చైతన్య ఆ కారణం చెప్పటంతో.ఇదెక్కడ విడ్డూరం రా బాబు అంటూ వెటకారం చేస్తున్నారు.