కాంగ్రెస్ లోకి చేరికలు లేనట్టేనా ? కారణం అదేనా ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్( BRS ) నుంచి వలసలు చాలా వరకు తగ్గిపోయాయి .దాదాపు పది మంది వరకు ఎమ్మెల్యేలు,  కొంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా , వారు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం , వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, దీనిపై కోర్టు సైతం దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో,  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు తగ్గుముఖం పట్టాయి.

 Is That The Reason For Not Joining The Congress, Brs, Bjp, Congress, Telangana E-TeluguStop.com

కోర్టులో ఈ వ్యవహారం నడుస్తూ ఉండడంతో , ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే తాను మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉండబోతున్నట్లు ప్రకటించారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పీకర్ ను  ఆదేశించడంతో , పార్టీ మారాలనుకున్న నేతలు ప్రస్తుతం తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 

Telugu Congress, Revanth Reddy, Telangana-Politics

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్( Congress )లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్ కు ఏర్పడింది .స్పీకర్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వెళ్తే కోర్టు తామే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.ఇదే జరిగితే ఖైరతాబాద్ , స్టేషన్ ఘన్ పూర్,  కొత్తగూడెంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది .అదే జరిగితే ఆ ఎన్నికలు తమకు   అనుకూలంగా ఉంటాయి అని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇక కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలు వస్తే మరోసారి విజయం తమదే అని భావిస్తోంది.  ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఖాతాలోనే ఆ మూడు స్థానాలు పడతాయని,  అప్పుడు బీఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని కాంగ్రెస్ అంచనా వేస్తూ ఉండగా,  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు , మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేనట్టుగానే కనిపిస్తున్నారు. 

Telugu Congress, Revanth Reddy, Telangana-Politics

పార్టీ మారాలనుకున్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.ప్రస్తుతం ఆరు గ్యారెంటీ అమలుతో పాటు,  మూసి ప్రక్షాళన,  హైడ్రా కూల్చేతలపైనే తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.  దీంతో సాధారణంగానే వలసలకు బ్రేక్ పడింది.హైడ్రా,  మూసి నది ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండడంతో బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ప్రస్తుతం నిలిచిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube