సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద.ఈ శుక్రవారం ప్రజల ముందుకు వచ్చి ఈ సినిమా మంచి మార్కులనే కొట్టేసింది.
ఎవరి సహాయం లేకుండా పూర్తి సినిమా బాధ్యతను తన భుజాలపై మోసిన సమంత సినిమాను చక్కగా నే ప్రెసెంట్ చేసింది.సినిమా షూటింగ్ సమయంలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూనే సినిమాను చక్కగా పూర్తి చేయగలిగింది.
ఇక సమంత యశోద సినిమా విజయానికి కారకులు ఈ ముగ్గురు మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎవరో చూసేద్దాం
సమంత
యశోద సినిమా అంటే సమంత… సమంత అంటే యశోద సినిమా అనేంతగా పూర్తిస్థాయిలో సమంత తన ప్రాణం పెట్టి పనిచేసిన సినిమా యశోద.ఆమె తప్ప మిగతా అన్ని పాత్రలు ఈ సినిమాలో సో సో గానే ఉన్నాయి.
ఎవరి పాత్రలో వారు బాగానే నటించినా ఖచ్చితంగా సమంత మాత్రమే ఈ చిత్రానికి బలం అని చెప్పుకోవచ్చు.యశోద సినిమా ఈరోజు ఈ స్థాయిలో మంచి రివ్యూలు దక్కించుకుంటుందంటే కారణం పూర్తిగా సమంత మాత్రమే.
కథ, కథనం
ఇక సమంత ఒక సినిమా చేస్తుంది అంటే దానికి సంబంధించిన పూర్తి బ్యాగ్రౌండ్, హోంవర్క్ చేశాకే ఒప్పుకుంటుంది.ఈ సినిమాకు కూడా ఆమె సరైన బ్యాగ్రౌండ్ వర్క్ చేసిందని అర్థమవుతుంది.
మంచి కథ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అద్దె గర్భం విషయంలో ఈ మధ్యకాలంలో ఒక మాఫియా తయారవుతుంది అని బయట ప్రపంచానికి బాగా తెలియదు.
పూర్తిగా ఈ సినిమా అర్ధ గర్భం గురించి కాకపోయినా బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ గురించి, పిండాలతో మాఫియా ఎలా అద్దె గర్భాలను వాడుకుంటుంది అనే విషయంలో బాగానే వర్కౌట్ చేసింది.చాలా చక్కగా ఈ కథను దర్శకులు ప్రజెంట్ చేశాడు.

దర్శకులు
ఇక ఈ సినిమాకి ఒక్కరు కాదు ఇద్దరు దర్శకులు ఉన్నారు.వారే హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్.ఇద్దరు మంచి కథను ఎంచుకొని మొదట్లో దానికి సరోగసి అనే ప్రచారం చేసినప్పటికీ ఇది పూర్తిగా సరోగసి విషయంలో వచ్చిన సినిమా కాదు.దాన్ని కాస్త టచ్ చేసినప్పటికీ కూడా మంచి థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించడంలో వీరిద్దరూ మార్కులు కొట్టేశారు.
ఇక వరలక్ష్మి, ఉన్ని కృష్ణన్ వంటి నటులు సినిమాకు బాగానే అసెట్ గా మారారు.