ఆదిపురుష్ టీజర్ చూసి చాలామంది డైరెక్టర్ ఓం రౌత్ ను తక్కువ అంచనా వేస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కార్టూన్ మూవీ చేస్తున్నాడంటూ ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.
అయితే ఓం రౌత్ సన్నిహితులు మాత్రం ఓం రౌత్ ను తక్కువ అంచనా వేయద్దని అంటున్నారు.ఓం రౌత్ తానాజీ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఈ మూవీ తర్వాత భారీ ఆఫర్స్ వచ్చాయి.కానీ ఓం రౌత్ మాత్రం ప్రభాస్ తో ఓ భారీ సినిమా చేయాలనీ.
ఆదిపురుష్ ను చేసారు.
ఈ సినిమా భారీ విజయం సాదిస్తుందని డైరెక్టర్ , నిర్మాతలు గట్టి నమ్మకం తో ఉన్నారు.
ఈ సినిమాలో ప్రభాస్, శ్రీరాముడి పాత్రలో నటించగా , సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.కృతి సనన్ జానకీ దేవిగా కనిపించనుంది.ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ ప్రస్తుతం జూన్ కు పోస్ట్ పోన్ చేసారు.
ఆదిపురుష్ పై వస్తున్న నెగటివ్ వార్తలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఓం రౌత్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.







