సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాలూకా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా.రెండో షెడ్యూల్ అతి త్వరలో మొదలుకానుంది.
మాములుగా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అనేది కామన్.ఈ సినిమా లో కూడా సెకండ్ హీరోయిన్ గా తేజ హీరోయిన్ ను ఫిక్స్ చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింసలో గీతిక తివారి అనే కొత్త అమ్మాయి నటిస్తోంది.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ ఈ భామ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ భామకు ఇప్పటికే మరొక రెండు సినిమాల్లో ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది.మొదట ఈ పాత్రలో శ్రీలీలను అనుకున్నారు.అయితే ఆమె సున్నితంగా తిరస్కరించడంతో గీతిక ఈ అవకాశాన్ని దక్కించుకుందని టాక్.మరి గీతిక కు మహేష్ మూవీ ఎంత కలిసి వస్తుందో.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.దానికి తగ్గట్లే త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారట.







