ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటికానున్న సంగతి తెలిసిందే.ఈరోజు రాత్రి 8:30 గంటలకు వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.ఇటువంటి తరుణంలో మోడీ.పవన్ కళ్యాణ్ భేటీపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీళ్ళిద్దరి భేటీ అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
ఇక తమా అభిప్రాయం కూడా అదేనని చెప్పుకొచ్చారు.వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా.
చూడటమే బీజేపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఉద్ఘాటించారు.ఇదిలా ఉంటే చాలాకాలం తర్వాత ప్రధాని మోడీతో పవన్ భేటీ అవుతూ ఉండటంతో.
ఈబేటి ఏపీ రాజకీయాలలో ఎటువంటి సంచలనాలకు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.







