న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఈటెల భూకబ్జా కేసు ప్రారంభించిన ఎసిబి

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు.

 Ap And Telangana Breaking News, Corona Cases In India, Covid Vaccine, Gold Rates-TeluguStop.com

2.లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించండి : హైకోర్టు

తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ లో ఉచిత భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

3.సిబిఐ ఆఫీస్ ముందు సీఎం మమత నిరసన

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన మంత్రి ని సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో పాటు టిఎంసి కార్యకర్తలు సిబిఐ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

4.టి ఎస్ ఆర్జేసి పరీక్ష వాయిదా

తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా  టి ఎస్ ఆర్జేసి పరీక్ష వాయిదా వేసినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది.

5.ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

ఏపీలో ఇప్పటి వరకు ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

6.ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్

కొత్తగా పుట్టుకొచ్చిన బ్లాక్ ఫంగస్ వైరస్ తో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ చికిత్సను  ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

7.రఘురామ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

సుప్రీంకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

8.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా కనిపించడం లేదు నిన్న స్వామివారిని 5,081 మంది దర్శించుకున్నారు.

9.నేటితో ఇంటింటి సర్వే పూర్తి

ఏపీలో జ్వర పీడితులకు గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు.సోమవారం సాయంత్రానికి ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

10.ఈటెల పై మంత్రి గంగుల విమర్శలు

అబద్ధాలతో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ ఆత్మగౌరవం అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త నాటకం ఆడుతున్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.

11.లాక్ డౌన్ పై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘ విచారణ మొదలైంది.

12.సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామరాజు

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.రఘురామ కృష్ణంరాజు ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి, ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించింది.

13.జూన్ 15 వరకు పూరి ఆలయం మూసివేత

ఒడిస్సా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం ను జూన్ 15 వరకు మూసే ఉంచాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

14.నన్నూ అరెస్ట్ చేయండి : మమత

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాధ్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ లను సిబిఐ అరెస్టు చేయడంతో మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.తనను అరెస్టు చేయాలంటూ ఆమె సీబీఐ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు.

15.రజనీకాంత్ విరాళం

కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగారు.ఈ మేరకు సీఎం ఎంకె స్టాలిన్ ను కలిసి 50 లక్షలు విరాళంగా అందించారు.

16.ప్రియాంక చోప్రా భర్త కు గాయాలు 

Telugu Ap Telangana, Ap Curfew, Corona India, Covid Vaccine, Gold Rates, Highcou

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జొనస్ ను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.లాస్ ఏంజిల్స్ లో శనివారం రియాల్టీ షో ‘ ది వాయిస్ ‘ షూటింగ్ చేస్తున్న సమయంలో కు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

17.కరోనా అవసరం 2 డిజి విడుదల

డీఆర్డీవో అభివృద్ధి చేసిన COVID 19 ఔషధం 2 డిజి నేడు విడుదలయ్యింది.

18.బాలకృష్ణ కు జోడీ గా శృతి హాసన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేయాలి అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

19.వ్యాక్సిన్ వేయించుకుంటే 97 శాతానికి పైగా రక్షణ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 97.38 శాతం మందిలో రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,080

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,080.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube