ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే చాలా మంది ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.ముడతలు వృద్ధాప్యానికి సంకేతం.
అందుకే ముడతలు వచ్చాయంటే ఎంతగానో హైరానా పడిపోతుంటారు.ముడతలను వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
అయితే ఇకపై టెన్షన్ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే ముడతలు మాయం అవడమే కాదు మీ ముఖ చర్మం వైట్ గా బ్రైట్ గా సైతం మారుతుంది.
ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా చిన్న క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.
అలాగే సాల్ట్ వాటర్ లో బాగా కడిగిన ఒక నిమ్మ పండును తీసుకుని పైతొక్క వచ్చేలా మాత్రమే తురుము కోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో క్యారెట్ తురుము, లెమన్ పీల్ తురుము, నాలుగు లవంగాలు, రెండు తుంచిన బిర్యానీ ఆకులు, ఒక కప్పు ఆలివ్ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ గ్లాస్ జార్ ను మరుగుతున్న నీటిలో కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.ఆపై స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ మ్యాజికల్ ఆయిల్ ను ముఖ చర్మానికి అప్లై చేసుకుని స్మూత్ గా కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం స్నానం చేయాలి.నైట్ నిద్రించే ముందు కూడా ఈ ఆయిల్ ను అప్లై చేసుకొని పడుకోవచ్చు.రోజుకు ఒకసారి ఈ ఆయిల్ ను కనుక వాడితే ముడతలు కొద్ది రోజుల్లోనే మాయమవుతాయి.చర్మం టైట్ గా మారుతుంది.పైగా ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడటం వల్ల ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.చర్మం పై మొండి మచ్చలు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.