ఫోర్బ్స్ స్వయం సంపన్న జాబితాలో ప్రవాస భారతీయ మహిళలు

ఎంతో అత్యత్తమ ప్రతిభ కలిగిన లేక ఎంతో మందిని ప్రభావితం చేసిన అదికాక ఆర్ధికంగా స్థిరపడి ప్రపంచంలో అత్యధికంగా సంపన్న జాబితాలో ఉన్నవారిని ఫోర్బ్స్ తన మ్యాగజైన్ లో ప్రచురిస్తుంది.ఈ పత్రికలో ఎవరి కోసం ప్రచురించినా సరే వారికి ఎన్నో ప్రతిభా ఫాటవాలు ఉన్నట్టు లెక్క అయితే ఈ ఫోర్బ్స్ పత్రికలో ఇద్దరు భారత సంతతి మహిళలకి కూడా చోటు కల్పించింది.

 Bharat Desai Womens In Forbes List-TeluguStop.com

ఇంతకీ వారు సాధించిన ఘటన ఏమిటంటే.

భారత సంతతికి చెందిన ఇద్దరు టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లకు స్వశక్తితో ఎదిగిన ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో స్థానంలో చోటు కల్పించింది.వారు జయశ్రీ ఉల్లాల్‌ , నీరజ శేఠి లు.ఫోర్బ్స్ జాబితాలో వీరిలో జయశ్రీ 18 స్థానంలో నిలవగా , నీరజ 21వ స్థానంలో నిలిచారు…జయశ్రీ ఉల్లాల్ లండన్‌లో జన్మించి భారత్‌లో పెరిగారు.జయశ్రీ ఉల్లాల్‌ ఇప్పుడు కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ అరిస్టా నెట్‌వర్క్స్‌ ప్రెసిడెంట్‌, సిఇఒగా పని చేస్తున్నారు.అయితే స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన ఈ కంపెనీ 2017 సంవత్సరంలో 160 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది.

ఈ కంపెనీలో జయశ్రీకి 5 శాతం వాటాలున్నాయి.ఆ వాటాల్లో కొన్నింటిని ఆమె తన ఇద్దరు పిల్లలు, మేనల్లుడు, మేనకోడలికి కూడా కేటాయించారు.

ఇక నీరజ శేఠి విషయానికి వస్తే ఐటి కన్సల్టింగ్‌ , ఔట్‌సోర్సింగ్‌ కంపెనీ సింటెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.ఆమె భర్త భరత్‌ దేశాయ్‌ ఈ కంపెనీ వ్యవస్థాపకుడు…1980లో రెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కంపెనీ 2017 నాటికి 92.4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది.23 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా…వారిలో 80 శాతం మంది ఇండియాలోనే పని చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube