గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇక టీడీపీ కి గుడ్ బై చెప్పనున్నారా.పూర్తిగా టీడీపీ తో సత్సంభందాలు తొలిగిపోయాయా.
అంటే అవుననే అంటున్నారు జిల్లా వాసులు అంతేకాదు ఆయన గత కొంతకాలంగా చేస్తున్న కార్యక్రమాలతో ఆయన టీడీపీ కి శాశ్వతంగా దూరం అయ్యారు అని నిర్ధారిస్తున్నాయి.అయితే త్వరలో ఏ పార్టీలోకి వెళ్తున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనే వివరాలలోకి వెళ్తే.
మంత్రిగా ఉన్నప్పుడు రావెల ఎక్కువగా వైసీపీ నేతలకి వారి వర్గం వారికే ఎక్కువగా పనులు చేసిపెట్టే వారని సొంత పార్టీ తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు ఎదో చెయ్యాలి అనేట్టుగా పనులు చేసే వారని అంతేకాదు కమ్మ సామాజిక వర్గం నేతలు వచ్చినప్పుడు వారిని ఎంతో అవమాన పరిచేవారని ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి అయితే ఈ వార్తల ఫిర్యాదుల నేపధ్యంలో బాబు ఆయన్ని మంత్రి పదవి నుంచీ తొలగించారు.అయితే టీడీపీ లో మంత్రిగా ఉన్న రావెల తన మంత్రి పదవి ఊడిపోవడం మొదలు ఆయన పార్టీ మారిపోనున్నారు అని ఎదో ఒక సందర్భంలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఆ వ్యాఖ్యలకి తగ్గట్టుగానే రావెల సైతం పార్టీ కార్యక్రమాలకి దూరంగానే ఉండేవారు.ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వెళ్ళే వారు కాదు.అయితే ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రావెల అలెర్ట్ అయ్యారు.ఈ సమయంలో వ్యక్తిగతంగా ఉన్న పేరు ని కాపాడుకోవడానికి అదే సమయంలో వైసీపీ తో తన బంధాన్ని కొనసాగించడానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు సంపాదించడానికి రావెల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అనే కామెంట్స్ నేపధ్యంలో రావెల తాజగా తలపెట్టిన దీక్ష ఈ వ్యాఖ్యలకి మరింత బలాన్ని చేకూర్చింది.
గుంటూరు లో వెలిసిన పోస్టర్లే ఇందుకు కారణం అంటున్నారు.రావెల ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సీ చట్టసవరణపై సుప్రీం కోర్టు చేసిన సిఫార్సులను ఉపసంహరించుకోవాలని ఆయన దీక్ష చేయబోతున్నారు.
అయితే అందుకు గాను పట్టణలో పెద్ద పెద్ద ఫ్లేక్సీల తో నింపేశారు.ఇందులో విశేషం ఏమిటంటే ఈ పోస్టర్లలో కేవలం ‘రావెల’ ఫోటో మాత్రమే ఉంది దాంతో ఈ విషయం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చకి దారి తీసింది.అయితే
ఆ పోస్టర్స్ లో ఎక్కడా కూడా తెలుగుదేశం గుర్తు కాని లేకపోవడం తో నాయకులు అందరూ రావెల పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు పార్టీని వీడారు అని ఫిక్స్ అయిపోయారు.వచ్చే ఎన్నికల్లో.
పత్తిపాడు నుంచి ఆయనకు టిడిపి అధినేత సీటు ఇవ్వరని తేలడంతోనే ఆయన తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని, దానిలో భాగమే ఈ దీక్ష అని టిడిపి నాయకులు చెబుతున్నారు…అయితే రావెల ఈ దీక్ష అనంతరం పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.