హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనను విరమించారు.ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నచ్చజెప్పడంతో పొన్నం అనుచరులు నిరసనను నిలిపివేశారు.
ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ కు మద్ధతు తెలిపిన ఎంపీ కోమటిరెడ్డి అవసరం అయితే తన పేరు పక్కన పెట్టి పొన్నం పేరును సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు.అయితే పార్టీలో పొన్నంకు సముచిత స్థానం కల్పించకుండా అవమానపరుస్తున్నారని ఆయన అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.
ఏ ఒక్క కమిటీలో స్థానం కల్పించకుండా అవమానించారని, పొన్నంపై కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని అనుచరులు ఆరోపించారు.అనంతరం ఇవాళ పీఏసీ సమావేశం కోసం వస్తున్న సీనియర్ నేతలకు అడ్డుకోవడంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.