పాత నీరు పోయి.కొత్త నీరు రావడం సహజం.
ఏరంగంలోనైనా ఈ ప్రక్రియ కామన్ గా జరుగుతుంది.కానీ టాలీవుడ్ లో పరిస్థితి కాస్త వెరైటీగా ఉంది.
ఏజ్ పెరుగుతున్నా.కొందరు హీరోలు ఇంకా స్టార్ హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు.
గతంలో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు సహా పలువురు హీరోలు ఏజ్ పెరిగే కొద్దీ తమను సూటయ్యే క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సైతం అలాగే దూసుకెళ్తున్నారు.
కుర్రాళ్లతో పోటీ పడీ మరీ దుమ్మురేపుతున్నారు.
చిరంజీవి 65 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా సినిమా రంగంలో కొనసాగుతున్నాడు.
ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో చేసినట్లుగానే ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు.యంగ్ హీరోలతో పోటీ పడి మరీ నటిస్తున్నాడు.అటు నాగార్జున, వెంకటేష్ ఏజ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.61 ఏళ్ళు నిండినా ఈ ఇద్దరు కెరీర్ పరంగా బాగానే రాణిస్తున్నారు.ఎక్స్ పరిమెంటల్ సినిమాల్లో నటిస్తూ ముందుకుసాగుతున్నాడు.తాజాగా ఆయన చేసిన నారప్ప.విడుదలకు సిద్ధం అవుతుంది.అటు షష్ఠి పూర్తి కంప్లీట్ చేసుకున్న నాగార్జున సైతం మస్త్ జోష్ లో ఉన్నాడు.
బంగార్రాజు అనే పక్కా మాస్ సినిమాలో నటిసస్తున్నాడు.
60 వయసులోనూ బాలయ్య మాస్ యాక్షన్ సినిమాలతో వారెవ్వా అనిపిస్తున్నాడు.ప్రస్తుతం బోయపాటితో అఖండ అనే సినిమా చేసస్తున్నాడు.
అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్.50 ఏండ్లు నిండినా జనాల్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.తాజాగా పవన్ నటించిన వకీల్ సాబ్ మంచి విజయాన్ని అందుకుంది.
జనాలు ఈ సినిమాను బాగా ఆకట్టుకున్నారు.
అటు మాస్ మహారాజా రవితేజకు 52 ఏండ్లు.తన 20 ఏండ్ల కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.సూపర్ డూపర్ హిట్స్ కొట్టటాడు.
ప్రస్తుతం ఆయన ఖిలాడీ మూవీతో ముందుకు రాబోతున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం 46 సంవత్సరాలు.20 ఏళ్ల కుర్రాడిలా నటిస్తూ ముందుకు సాగుతున్నాడు.