ఓ పక్క కుమార్తె అదృశ్యం.. మరోవైపు లే ఆఫ్‌ల భయం, అమెరికాలో భారతీయ తండ్రి ఆవేదన

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.

 Fearing Her Father Layoff Indian School Student Goes Missing From Home In Americ-TeluguStop.com

దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌,అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.

ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.

అమెరికన్ టెక్ సెక్టార్‌లో భారీ తొలగింపుల మధ్య అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు.ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ సంస్థలు హెచ్ 1 బీ వీసా హోల్డర్ల గ్రేస్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి సంవత్సరానికి పైగా పొడిగించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించాయి.

సరిగ్గా ఈ పరిణామాల నేపథ్యంలో ఓ భారతీయ తండ్రికి అనుకోని కష్టం వచ్చింది.తన ఉద్యోగం ప్రమాదంలో పడటంతో పాటు కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆయన బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు.

దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించ లేదు.అర్కాన్సాస్ రాష్ట్రంలోని కాన్వేకు చెందిన తన్వి మరుపల్లి జనవరి 17న ఉదయం బస్సులో పాఠశాలకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.

దీనిపై తన్వి తండ్రి పవన్ రాయ్ మాట్లాడుతూ.ప్రస్తుతం అమెరికాలో ‘‘లే ఆఫ్’’ల కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం వుందన్నారు.

దీంతో తమ కుటుంబం అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu America, Convay, Layoff, Indian School, Indian Teen, Pawanrai, Tanvi Maru

2022-23లో దాదాపు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు.ఈ పరిణామాలు హెచ్ 1 బీ వీసాపై వున్న వారిని వణికిస్తున్నాయి.ఈ కేటగిరీ కింద వున్న వారు ఉద్యోగం కోల్పోతే.60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని పొందాలి.లేనిపక్షంలో వారు అమెరికాను వదిలి వెళ్లాల్సి వుంటుంది.

అయితే తన్వి తల్లిదండ్రులు.తమ కుటుంబ ఇమ్మిగ్రేషన్ స్థితి కారణంగా పారిపోయిందని మీడియాలో కథనలు వస్తున్నాయి.

చాలా ఏళ్లుగా వీరి కుటుంబం అమెరికాలో నివసిస్తోంది.ఈ క్రమంలో ఆ దేశ పౌరసత్వం పొందాలనే ఆశతో ప్రయత్నిస్తున్నప్పటికీ.

ప్రస్తుత ఆర్ధిక మాంద్యం కారణంగా వీరి పరిస్ధితి అడకత్తెరలో పొకచెక్కలా మారిందని తన్వి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu America, Convay, Layoff, Indian School, Indian Teen, Pawanrai, Tanvi Maru

ఆమె తండ్రి పవన్ రాయ్ మరుపల్లి ఒక టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.ఈయన కూడా లే ఆఫ్‌ను ఎదుర్కోనే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఆమె తల్లి శ్రీదేవి ఈదర ఉద్యోగం కోల్పోయిందని మీడియా నివేదిక చెబుతోంది.

శ్రీదేవి తొలుత భారత్‌కు వచ్చి పవన్‌ రాయ్ డిపెండెంట్ వీసా ద్వారా తిరిగి అమెరికాకు వచ్చింది.ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.గతేడాది నవంబర్ నుంచి దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి.

అమెరికాలోని టెక్ ఇండస్ట్రీలో 30 నుంచి 40 శాతం మంది భారతీయ టెక్ నిపుణులు పనిచేస్తున్నారు.వీరంతా హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలపై వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube