నేడు బాలల దినోత్సవం కావడంతో పిల్లలందరూ కూడా ఈ పండుగ రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే బాలల దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు సైతం వారి పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని తన సినిమా షూటింగులన్నింటిని పక్కనపెట్టి తన కుమారుడితో కలిసి సరదాగా గడిపారు.
ఈ క్రమంలోనే నాని తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్ కు వెళ్లాడు .అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్నర్స్ స్టాచ్యూ ముందు నాని-అర్జున్ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం నాని తన కుమారుడితో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో నాని కుమారుడు అర్జున్ మిక్కీ మౌస్ డ్రెస్ వేసుకొని చూడటానికి ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియో వైరల్ అవుతుంది.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమాలో నాని సరసన మరోసారి కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.