తెలుగు బుల్లితెరపై 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం పూర్తి చేసుకొని 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.పదవ వారంలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లిన సంగతి తెలిసిందే.
శనివారం స్ట్రాంగ్ కంటెంట్ అయినటువంటి బాలాదిత్య బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లారు.ఆదివారం గ్లామర్ డాల్ వాసంతి ఎలిమినేట్ అయింది.ఇలా ఊహించని విధంగా బిగ్ బాస్ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించారు.
21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం పదిమంది కంటెస్టెంట్లతో టైటిల్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.ఇకపోతే పదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాసంతి పరివారాలపాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగినందుకు ఈమె ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈమె ఒక్క వారానికి 25వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
వాసంతి ఒక్క వారానికి 25 వేల రూపాయలు చొప్పున 10 వారాలకు గాను 2.5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.అయితే వాసంతికి ఈ రెమ్యూనరేషన్ ఎంతో సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు.అయితే తను బిగ్ బాస్ హౌస్ కి రావడం వల్ల ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఒక నటిగా తాను మరి కొంతమందికి రీచ్ అయ్యానని ఈమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.