ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఎప్పుడూ లేని ఇరిటేషన్ వస్తుందని తెలిపారు.
అంతేకాకుండా తనకు సంబంధం లేని వాటిని ఆపాదిస్తున్నారని బాలినేని పేర్కొన్నారు.రాజకీయాలంటేనే విరక్తి పుట్టిందని చెప్పారు.
రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు సినిమాలు తీయాలనే కోరిక ఉండేదని తెలిపారు.సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టి సినిమాలు తీస్తానని వెల్లడించారు.
జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న బాలినేని ఆయన మరోసారి సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
మీరంతా అండగా ఉంటేనే పోటీ చేస్తా లేదంటే చేయనని స్పష్టం చేశారు.