ఏందయ్యా ఇది.. వీధిని ఇలా కూడా క్లీన్ చేస్తారా.. ఐడియా అదుర్స్..!

బద్ధకస్తులు వారి పనులను వేరే వారికి అప్పజెప్పడానికి ఎన్నో క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తుంటారు.శ్రమ తప్పించుకోవడానికి బుర్ర పెట్టి ఆలోచిస్తారు.

 Smart Idea To Clean Roads Viral Video,street Cleaning Device, Viral Video, Homem-TeluguStop.com

చివరికి స్మార్ట్ వర్క్( Smart Work ) తో అందరినీ ఆకట్టుకుంటారు.ఇక ఇండియాలో అలాంటి వారికి కొదవ లేదు.

దేనికైనా సింపుల్ గా పరిష్కారం కనిపెడుతుంటారు తాజాగా స్ట్రీట్స్ క్లీన్( Street Cleaning ) చేసే వ్యక్తి ఒక స్మార్ట్ డివైజ్‌ తయారు చేశాడు.దాంతో వీధులను ఊడ్చడం చాలా తేలికైపోయింది.

నిజానికి అలాంటి ఐడియా ఎవరూ చేసి ఉండరు కానీ సదరు వ్యక్తి ఎవరికీ రాని ఆలోచన చేసి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఈ వీధి శుభ్రపరిచే స్మార్ట్ డివైజ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డివైజ్‌ను వాహనం వెనుక భాగంలో అమర్చారు.ఆ డివైజ్‌లో ఒక తిరిగే చక్రం, దానికి యాడ్ చేసిన నాలుగు చీపుర్లు ఉంటాయి.వాహనం కదులుతున్నప్పుడు చీపుర్లు( Brooms ) దాని వెనుక రోడ్డును ఊడ్చేస్తున్నాయి.డివైజ్‌ సాధారణ సమస్యను పరిష్కరించడానికి సాధారణ సాంకేతికతను ఉపయోగించే ఇంట్లో తయారు చేసిన ఆవిష్కరణగా కనిపిస్తుంది.

శుక్రవారం నాడు ఎక్స్ అకౌంట్ @posts_garbage ద్వారా వీడియో షేర్ చేశారు.ఖాతాలో వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనేది పేర్కొనలేదు, కానీ కొంతమంది యూజర్లు అది భారతదేశానికి చెందినదిగా భావించారు.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 67 లక్షలకు పైగా వ్యూస్, లక్ష వరకు లైక్‌లు వచ్చాయి.చాలా మంది యూజర్ క్రియేటివ్ ఇన్నోవేషన్‌ను ప్రశంసించారు.ఖరీదైన, అధునాతన యంత్రాలను ఉపయోగించకుండా వీధులను శుభ్రం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు.ఇన్నోవేటివ్ సొల్యూషన్స్‌( Innovative Solutions )కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు.

అక్టోబరులో, తన ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి తన ఇంటి నుండి ఈగలను పారద్రోలిన ఒక యువకుడి వీడియో కూడా చాలా మంది వినియోగదారులను ఆకట్టుకుంది.బాలుడు ఈగలు గుమిగూడిన బల్బును స్విచ్ ఆఫ్ చేసి, వాటిని ఆకర్షించడానికి తన ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేశాడు.

అతను తన ఫోన్‌ను స్ట్రీట్ లైట్ వద్దకు తీసుకెళ్లి, తన ఫ్లాష్‌లైట్‌ను ఆఫ్ చేసి, స్ట్రీట్ లైట్( Street Light ) పై ఈగలను వదిలివేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube