ఏంటి? అక్కినేని నాగార్జున కొడుకులు ఇద్దరినీ చూశాం కదా! అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరు బాగున్నారు కదా! ఇప్పుడు కొత్తగా చూడటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అక్కడికే వస్తున్న! నాగార్జున రియల్ కొడుకుల గురించి చెప్పడం లేదు.రీల్ కొడుకుల గురించి చెప్తున్నా.
అదేనండి.2002లో నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా ”సంతోషం”లో నాగార్జున కొడుకు పాత్రలో నటించాడు చుడండి బుడ్డోడు.ఆ బుడ్డోడి పేరు అక్షయ్ బచ్చు.ఆ కుర్రాడు అందిరికి గుర్తు ఉండే ఉంటాడు.అయితే ఆ పిల్లాడు మన టాలీవుడ్ కాదు.బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్, సినిమాల్లో బాలనటుడిగా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
హిందీ సినిమాలో అతని నటన చుసిన నాగార్జున సంతోషం సినిమాలో ఛాన్స్ ఇప్పించాడు.ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ సూపర్ హిట్ సినిమా అయినా వర్షంలోను నటించాడు.
ఆతర్వాత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు ఈ బుడ్డోడు.ఇక అక్కడ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ నటించాడు.
బాలీవుడ్ లో 12 సినిమాల్లో నటించిన ఈ బాలుడు దాదాపు 45కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యాడు.