దేశీయ టెలీకాం దిగ్గజం జియో మరో సంచలనానికి తెరలేపింది.కొన్ని రోజుల క్రితం టారిఫ్ ధరలు పెంచడంతో జియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా బాటలో జియో అడుగులు వేయడంతో జియో యూజర్లపై భారం పెరిగింది.అయితే జియో తాజాగా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందించడానికి సిద్ధమైంది.
జియో ప్రచారం చేయకుండా వాల్యూ కేటగిరీలో రూపాయికే 100 ఎంబీ డేటాను పొందే ప్లాన్ ను యాడ్ చేసింది.రూపాయికి 100 ఎంబీ ఇవ్వడంతో పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 30 రోజులు కావడం గమనార్హం.100 ఎంబీ 4జీ డేటా కేవలం రూపాయికే అందుబాటులోకి వస్తుండటంతో జియో యూజర్లకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.100 ఎంబీ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ తో ఇంటర్నెట్ ను పొందవచ్చు.

జియో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్ ఇతర టెలీకాం కంపెనీలకు షాక్ అనే చెప్పాలి.ప్రస్తుతం ఏ టెలీకాం కంపెనీ ఈ స్థాయిలో ఆఫర్ ను అందించడం లేదు.మై జియో యాప్ సహాయంతో సులభంగా ఈ ఇంటర్నెట్ ప్యాక్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తున్న ప్లాన్ కావడంతో యూజర్లు ఈ ప్లాన్ పై ఆసక్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

మరోవైపు జియో యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రూపాయికే జియో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గురించి నెటిజన్లు స్పందిస్తూ వాటర్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకే జియో ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.జియో కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు.జియో కొత్త ప్లాన్ పై ఇతర టెలీకాం కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.