లావుగా ఉన్నాం అని రోజు అద్దం ముందు నిలబడి మానసిక క్షోభను అనుభవించేవారు ఎందరో ఉన్నారు.పైగా అధిక శరీర బరువు కారణంగా ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లు మరింత బాధ పెడుతుంటాయి.
శరీర బరువు అదుపు తప్పడం వల్ల మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ ఇలా ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందుకే బరువు తగ్గడం కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను ఖాళీ కడుపుతో కనుక తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లోనే సన్నగా మల్లె తీగల మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు సహాయపడే ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ కలిపి ఖాళీ కడుపుతో సేవించడమే.ఈ క్యారెట్ మింట్ జ్యూస్ వెయిట్ లాస్‌కు ఎంతగానో సహాయపడుతుంది.ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున ఈ జ్యూస్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
దీంతో క్యాలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఈ క్యారెట్ మింట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా వేగంగా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజనల్ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.కంటి చూపు పెరుగుతుంది.
మరియు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.