తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్నారు.ఇక లైగర్ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.ఈ క్రమంలోనే రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం సమంత సినిమా షూటింగ్లకు దూరం కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇకపోతే ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది.ఇలా ఈమె ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అవుతున్నారు.ఈ క్రమంలోనే సమంత ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న సిటాడెల్ సిరీస్ లో బిజీగా మారారు.అయితే మహిళ దినోత్సవం సందర్భంగా సమంత తిరిగి ఖుషి సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత సమంత తిరిగి లొకేషన్ లోకి రావడంతో చిత్ర బృందం ఈమెకు ఘనంగా స్వాగతం పలికారు.

ఇలా సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి టీం ఆమె 13 సంవత్సరాల తన సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తన చేత కేక్ కట్ చేయించారు.ఇలా సమంతకు వెల్కమ్ చెప్పినటువంటి చిత్ర బృందం మార్చి 8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులను కూడా జరుపుకున్నట్లు తెలియజేశారు.ఇక ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ పనులను జరుపుకొనుంది.
ఇక తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శకుడు శివా నిర్వాణ వెల్లడించారు.ఈ విషయం గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ..పీటర్ హెన్స్ ఈ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ఇక సమంత తిరిగి ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనడంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







