రక్తహీనత( Anemia ).ఇదేమి జబ్బు కాదు.
శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్య.పురుషులతో పోలిస్తే మహిళలు, పిల్లలు ఎక్కువగా రక్తహీనత బారిన పడుతుంటారు.
రక్తహీనత మనం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు.రక్తహీనత బారిన పడ్డవారు త్వరగా అలసిపోతారు.
కాళ్లవాపులు, నీరసం, గుండె దడ, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇవన్నీ రక్తహీనత లక్షణాలు.కాబట్టి రక్తహీనత ఉన్నవారు దాని నుండి త్వరగా బయటపడేందుకు ప్రయత్నించాలి.
చాలామంది మందులు వాడుతుంటారు.ఇంకొందరు మందులతో పని లేకుండా రక్తహీనతను తరిమి కొట్టాలని భావిస్తుంటారు.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ జ్యూస్ గ్రేట్ సహాయపడుతుంది.ఈ జ్యూస్ ను నిత్యం కనుక తీసుకుంటే ఎటువంటి మందులు వాడకుండానే రక్తహీనత నుంచి బయటపడవచ్చు.
ఈ జ్యూస్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు దానిమ్మ గింజలు( Pomegranate ), అరకప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు ఆపిల్ ముక్కలు( Apple ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ గా తరిగిన ఉసిరికాయ ముక్కలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా ఒక టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ అవుతుంది.
ప్రతిరోజు ఉదయం ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే బాడీకి బోలెడు పోషకాలు లభిస్తాయి.ఈ జ్యూస్ లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల ఇది రక్తహీనతను సమర్థవంతంగా తరిమి కొడుతుంది.శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
అందువల్ల రక్తహీనతతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ జ్యూస్ ను ప్రయత్నించండి.పైగా ఈ హెల్తీ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
చూపు రెట్టింపు పెరుగుతుంది.ఈ జ్యూస్ గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.
కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది రక్తపోటును సైతం అదుపులో ఉంచుతుంది.