బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా ఈ నెల 19వ తేదీన బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది.బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్టులకు సంబంధించి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ అని చాలామంది భావిస్తున్నారు.షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ కావచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు శ్రీరామచంద్ర బిగ్ బాస్ సీజన్5 విన్నర్ కావాలని కోరుకునే ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువేం కాదు.మానస్, సిరిలను కొంతమంది సపోర్ట్ చేస్తున్నా ఈ ఇద్దరినీ సపోర్ట్ చేసేవాళ్ల సంఖ్య మరీ తక్కువగా ఉండటం గమనార్హం.
అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి శ్రీరామచంద్రకు సపోర్ట్ ప్రకటించారు.ఇప్పటికే సోనూసూద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు శ్రీరామచంద్రకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కృష్ణంరాజు భార్య వీడియో మెసేజ్ ద్వారా శ్రీరామచంద్రకు మద్దతు ప్రకటించారు.హాయ్ శ్రీరామ్ అని చెబుతూ బిగ్ బాస్ షోను చూస్తున్నామని శ్యామలాదేవి పేర్కొన్నారు.
తనకు, కృష్ణంరాజుకు శ్రీరామచంద్ర పాటలు అంటే ఎంతో ఇష్టం అని శ్యామలాదేవి వెల్లడించారు.శ్రీరామచంద్ర పాడిన భక్తి పాటలు అంటే మరింత ఎక్కువ ఇష్టమని శ్యామలాదేవి పేర్కొన్నారు.ఇండియన్ ఐడెల్ లో శ్రీరామచంద్ర గెలవడం ద్వారా ఎంతోమందికి శ్రీరామచంద్ర గర్వకారణం అయ్యారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.
శ్రీరామచంద్ర బిగ్ బాస్ విన్నర్ కావాలని ఫ్యామిలీ నుంచి మనస్పూర్తిగా కోరుకుంటున్నానని శ్యామలాదేవి అన్నారు.శ్రీరామచంద్ర తప్పకుండా గెలుస్తాడని ఆల్ ది బెస్ట్ అని శ్యామలాదేవి తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్ లభించడంతో శ్రీరామచంద్ర ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా శ్రీరామచంద్రకు సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.