రక్తహీనత వేధిస్తుందా? అయితే మందులు అక్కర్లేదు దీన్ని డైట్ లో చేర్చుకోండి!

ప్రస్తుత రోజుల్లో రక్తహీనత బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు గా మారుతుంది.

 If This Juice Is Included In The Diet, Anemia Will Go Away! Anemia, Latest News,-TeluguStop.com

అందుకే రక్తహీనతను వదిలించుకోవడం కోసం దాదాపు అంద‌రూ మందులపై ఆధారపడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే మందులు అక్కర్లేదు.

సహజంగానే రక్తహీనత సమస్యకు చెక్ పెట్ట‌వ‌చ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం రక్తహీనతను తరిమికొట్టే ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

Telugu Anemia, Tips, Latest, Spinachbanana-Telugu Health

ముందుగా ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి సన్నగా స్పైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులను నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.మరియు అరకప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో పాలకూర ఆకులు, క‌ట్ చేసి పెట్టుకున్న‌ అరటిపండు స్లైసెస్, పైనాపిల్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఐదు నైట్ అంత వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదంపప్పు వేసుకోవాలి.

Telugu Anemia, Tips, Latest, Spinachbanana-Telugu Health

చివ‌రిగా ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను నేరుగా సేవించడమే.రెండు రోజులకు ఒకసారి ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే ఐరన్ లభిస్తుంది.దీంతో రక్తహీనత సమస్య దూరం అవుతుంది.పైగా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవ‌డం వల్ల మెదడు పనితీరు మునుపటి కంటే చురుగ్గా సాగుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.మరియు చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా సైతం మెరుస్తుంది.

కాబట్టి రక్తహీనత సమస్యతో సతమతమవుతున్న వారు తప్పకుండా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube