యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే.యాక్సిడెంట్ వార్తలు నిన్నంతా కూడా మీడియాలో మరియు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.
రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య జీవిత మరియు కూతురు స్పందించారు.అయితే వీరు ఎవరు కూడా రాజశేఖర్ మద్యం తాగి ఉన్నాడనే విషయాన్ని చెప్పలేదు.
అసలు ఆ విషయం పట్ల వారు నోరు విప్పలేదు.కారులో మద్యం ఉన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించకుండా కేవలం యాక్సిడెంట్ అయ్యింది, అంతా బాగానే ఉంది అన్నట్లుగా స్పందించారు.
పోలీసుల కథనం ప్రకారం యాక్సిడెంట్ అయిన చోట రెండు మూడు మద్యం బాటిల్లు లభ్యం అయ్యాయట.అదే విధంగా యాక్సిడెంట్ అవ్వడానికి ముందు కూడా రాజశేఖర్ మద్యం తీసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాగిన మైకంలో ఓవర్ స్పీడ్‌తో రాజశేఖర్ కారును డ్రైవ్ చేస్తున్నాడట.దాదాపుగా 180 స్పీడ్‌లో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.అంత స్పీడ్‌గా వస్తున్న కారణంగానే అదుపు తప్పి కారు డివైడర్‌ను గుద్దిందని, అంతే తప్ప రాజశేఖర్ కారు టైరు మొదట బరెస్ట్ అవ్వడం ఆ తర్వాత ఫల్టీలు కొట్టడం జరగలేదని చెబుతున్నారు.

కారు అదుపు తప్పడానికి ముందు టైరు బరెస్ట్ అయ్యిందని రాజశేఖర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు చెబుతుండే కొందరు మాత్రం వారి వాదన కొట్టి పారేస్తున్నారు.ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ కారణంగా బండి కంట్రోల్ తప్పి ఆ తర్వాత కారు యాక్సిడెంట్ అయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ విషయమై పోలీసులు మరియు కుటుంబ సభ్యులు భిన్న వాదనలు వినిపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.