టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ దర్శకుడు రాజమౌళి( S.S.Rajamouli ) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఛత్రపతి ( Chatrapathi ).ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 18 ఏళ్ళు పూర్తి అయ్యింది.అప్పట్లోనే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.కాగా ఈ సినిమాను ఇప్పుడు హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas ).ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడా ఈ సినిమాను నిర్మించారు.మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు మీడియాకు ముందుగానే ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారం వేసి చూపించారు.

అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా వి.వి.వినాయక్( V.V.Vinayak ) మాట్లాడుతూ.ఒరిజినల్ వెర్షన్ లోని ఐకానిక్ సీన్స్‌ను పాడుచేయకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందించాము.
యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఫ్రెష్‌గా ఉంటాయి.ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు.
హిందీలో పెద్ద స్టార్ అవుతాడని అంటూ పొగడ్తలు కురిపించారు వివి వినాయక్.బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నింటినీ ఆయనే హిందీలోకి డబ్ చేశారని అందువల్లే శ్రీనివాస్ తోనే ఆయన ఛత్రపతి రీమేక్ కూడా చేశారని తెలిపారు.

ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి మొదట సంకోచించానని బెల్లంకొండ సురేష్ పట్టుబట్టడంతో కాదనలేకపోయాను అని చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.అయితే జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఆది.అప్పట్లో విడుదలైన ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యారు.ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.
ఈ సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేయవచ్చు కదా అని ఈ ప్రెస్ మీట్ లో ఒక మీడియా రిపోర్టర్ ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన వివి వినాయక్.
సాయి శ్రీనివాస్ ఆ స్టేజ్ దాటిపోయాడని వినాయక్ అన్నారు.ఇప్పటికే శ్రీనివాస్ చాలా సినిమాలు చేసేశాడని.
నిజానికి ఆది సినిమా చేసేటప్పటికి ఎన్టీఆర్ చాలా చిన్నవాడని వినాయక్ గుర్తుచేశారు.అంటే ఆది కథకు ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సూట్ అవ్వరని వినాయక్ అభిప్రాయం.