విరూపాక్ష( Virupaksha ) మూవీ సక్సెస్ ఆ సినిమాలో నటించిన నటీనటుల కంటే ఆ మూవీలో కీలక పాత్రలో నటించిన రవికృష్ణకు( Ravikrishna ) ప్లస్ అయింది.బిగ్ బాస్ షోలో మంచోడిగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు విరూపాక్ష సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.
రవికృష్ణ ఈ సినిమా రిలీజ్ తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.రవికృష్ణ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే విరూపాక్ష ముందు విరూపాక్ష తర్వాత అని మాట్లాడుకోవాలి.
రవికృష్ణ బిగ్ బాస్ షో ( Bigg Boss Show )తర్వాత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సినిమాలతో బిజీ కావడం గమనార్హం.ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో రవికృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
కార్తీక్ దండు( Karthik Dandu ) రవికృష్ణ రోల్ ను అద్భుతంగా చూపించారనే చెప్పాలి.రవికృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లుక్ టెస్ట్ చేసి విరూపాక్ష మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
నేను ఎలాంటి సక్సెస్ కోరుకున్నానో ఆ సక్సెస్ ఈ సినిమాతో దక్కిందని రవికృష్ణ తెలిపారు.

టీవీ నుంచి వచ్చిన వాళ్లకు అంత పెద్ద రోల్ ఎవరూ ఇవ్వరని కార్తీక్ సార్ నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.సంయుక్త మీనన్( Sanyukta Menon ) ను అందరూ లక్కీ అంటారని అయితే తను ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని రవికృష్ణ చెప్పుకొచ్చారు.స్క్రీన్ పై నన్ను నేను చూసుకుని ప్రస్తుతానికి ఇది చాలు అని అనిపించిందని రవికృష్ణ పేర్కొన్నారు.
బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రానున్నానని ఆయన తెలిపారు.

త్వరలో రెండు సర్ప్రైజ్ లు ఉంటాయని ఆ పాత్రలను ఇప్పుడే రివీల్ చేయలేనని రవికృష్ణ పేర్కొన్నారు.నేను వర్క్ టైమ్ లో ఇంట్రావర్ట్ అని ఆయన తెలిపారు.బిగ్ బాస్ షో సమయంలోనే శివజ్యోతితో పరిచయం ఏర్పడిందని మా ఇద్దరి మధ్య ప్యూర్ బాండ్ అలాగే ఉంటుందని రవికృష్ణ పేర్కొన్నారు.
శివజ్యోతి గురించి చెబితే నా కళ్లలో నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు.







