పేదల కన్నీళ్లు పెద్ద వారికేం తెలుసు.తెలంగాణాలో ప్రస్తుతం ఇవే పరిస్దితులు నెలకొన్నాయంటున్నారు కొందరు.
ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు తిరగబడటం ప్రజలకు తెలుసు.
ఇలా తిరగబడ్ద ప్రజల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడగా, ఒక మహిళ తహశీల్దార్ పై చేయిచేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే జిల్లా కేంద్రంలోని గాయత్రి గుట్ట సమీపంలో సర్వే నెంబర్ 287 లో ఉన్న భూమిని కొండ బిక్షం, గంగరబోయిన సుభద్ర, దేవిశెట్టి రామచంద్రయ్యలు 2014 లో కొనుగోలు చేశారు.
అయితే అధికారులు ఆ స్థలాన్ని సఖీ కేంద్రం నిర్మాణానికి కేటాయించారు.
కాగా నాలుగు నెలల క్రితం ఈ ప్రదేశంలో సఖీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా వారు వెనుదిరిగారట.
ఈ క్రమంలో ఈ రోజు పోలీస్ బందోబస్తుతో, ఆ స్థలంలో, జేసీబీతో గుంటలు తీస్తుండగా, బాధితులు అడ్డుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
పోలీసులు వారిని అడ్డుకుని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారట.ఆ సమయంలో ఆవేశంతో ఉన్న ఓ మహిళ తహశీల్దార్‌పై దాడి చేసింది.