సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజకీయ సినీ క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖుల బయోపిక్ చిత్రాలను తీయడం సర్వసాధారణం.ఒకప్పుడు మన దేశానికి ప్రతి ఒక్కరంగంలోనూ ఎన్నో సేవలు చేసిన వారి బయోపిక్ చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే వారు.
అయితే ప్రస్తుతం కూడా ఈ బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
కరణ్ జోహార్ కేవలం దర్శకుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే తాజాగా ఈయన బయోపిక్ చిత్రం కూడా చేయాలని విషయం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కరణ్ జోహార్ తన బయోపిక్ చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎప్పటినుంచో తనకు తన బయోపిక్ చిత్రం చేయాలని కోరికగా ఉందని తెలిపారు.

ఈ విధంగా తన బయోపిక్ చిత్రం చేయాలని కోరిక కలిగి ఉండడమే కాకుండా తన బయోపిక్ చిత్రంలో నటించడానికి ఎవరు పర్ఫెక్ట్ గా సరిపోతారనే విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.తన బయోపిక్ చిత్రం కనుక చేస్తే హీరో రణవీర్ సింగ్ పర్ఫెక్ట్ గా సరిపోతారని కరణ్ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇది తెలిసిన బాలీవుడ్ ప్రేక్షకులు బయోపిక్ చిత్రం రావడం పక్కా అని, ఈ మూవీ బాలీవుడ్‌లో మోస్ట్ కలర్‌ఫుల్ బయోగ్రాఫికల్ మూవీ అవుతందనీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి కరణ్ తన బయోపిక్ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తారో తెలియాల్సి ఉంది.