అవసరాల బట్టతల కట్టుకథ బయటపెట్టారు... సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

రెండు రోజుల క్రితం నటుడు అవసరాల శ్రీనివాస్ అసలు భాగోతం అంటూ అతని దగ్గర కో డైరెక్టర్ ఒక వీడియో సోషల్ మీడియా పోస్ట్ చేశాడు.ఈ వీడియోని అన్ని చానల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి.

 First Look Of Srinivas Avasarala's Nootokka Jillala Andagadu, Tollywood, Telugu-TeluguStop.com

కొంతమంది మరో అడుగు ముందుకి వేసి సోషల్ మీడియాలో అవసరాల శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తూ ఇండస్ట్రీ నీ బాబు సొత్తు కాదు కనిపించకుండా చేయడానికి అంటూ అతనికి క్లాసులు కూడా పీకారు.విశ్లేషణలు సైతం చేసేశారు.

అయితే కొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్ స్ట్రాటజీ అని చాలా ఈజీగా కనిపెట్టేశారు.ఆ వీడియో అంతా ఏదో కావాలని చేసినట్లు ఉందని అనుకున్నారు.

అలా ఊహించినట్లుగానే ఆ వీడియో అంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం అని స్పష్టం అయిపొయింది.కేవలం సినిమాకి ముందుగా హైప్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఫ్రాంక్ వీడియో చేసినట్లు అవసరాల శ్రీనివాస్ రిలీజ్ చేసిన అతని కొత్త సినిమా పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది.

అవసరాల ప్రస్తుతం 101 జిల్లాల అందగాడు అనే సినిమా చేస్తున్నాడు.హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన బాలా మూవీకి రీమేక్ గా తెలుగులో దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో అవసరాల టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.సినిమాలో అతని క్యారెక్టర్ పేరు గొత్తి సత్యనారాయణ.

పెళ్లి కాని యువకుడుకి బట్టతల వస్తే అది అతనిని ఎంత ఇబ్బంది పెట్టింది అనే ఎలిమెంట్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇందులో అవసరాలకి జోడీగా రుహానీ శర్మ నటిస్తుంది.

విద్యాసాగర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాని దిల్ రాజు, క్రిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మొత్తానికి ఒక వీడియో చేసి అందరిని ఫూల్స్ చేసి అవసరాల తన సినిమాకి కావాల్సినంత హైప్ తెచ్చుకున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube