నిజం చెబితే చస్తారు...ఆ భాద మీకు తెలియదు పూనమ్ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) శాంతి( Shanthi ) విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.కొన్ని మీడియా ఛానళ్లు ఈమె విషయం పట్ల ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు కథనాలపై విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Poonam Kaur Comments About Media Manipulation In Her Life Details,poonam Kaur,me-TeluguStop.com

ఇలా మీడియా తప్పుడు కథనాలను రాస్తూ తన  పై బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని నిజా నిజాలు అన్నిటిని బయటకు తీస్తానని చెప్పడమే కాకుండా మీడియా వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

ఈ విధంగా శాంతి విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) స్పందించారు.చాలా ధైర్యంగా మాట్లాడటంతో ఈయన పై ప్రశంసల వర్షం కురిపించారు.అంతేకాకుండా శాంతికి మద్దతుగా నిలబడుతూ మీరు మీడియా ముందు కన్నీళ్లు కారిస్తే అదే వారి బలహీనతగా మార్చుకుంటారు ధైర్యంగా పోరాటం చేయండి అంటూ మద్దతు తెలిపారు.

అంతే కాకుండా మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్మెయిలింగ్ ఇన్స్టిట్యూట్ గా మారిపోయాయని ఈమె కౌంటర్లు వేశారు.

ఇలా విజయసాయిరెడ్డి శాంతి వివాదం పై ఈమె స్పందించడంతో ఒక నెటిజన్ ఈమె పోస్ట్ పై స్పందిస్తూ.వుమెన్ కార్డ్ అంటూ ఇలా నిజానిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడం, వారికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు.కాస్ట్, జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పగలగాలి అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ కు ఈమె స్పందిస్తూ.

తన గురించి ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తుంటాయి.ఆ బాధ మీకు తెలియదు మీ వరకు వచ్చినప్పుడే తెలుస్తుంది.ఒకవేళ నిజం చెప్పి నిజం తరుపున మాట్లాడిన చంపేస్తారు.అయినా నేను పోరాడుతాను అంటూ ఈమె చేసిన పోస్ట్  సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube