నేటి టెక్నాలజీ యుగంలో ఎవరి ఇంట్లో చూసినా రిఫ్రిజిరేటర్ కామన్‌గా కనిపిస్తోంది.ధనిక కుటుంబం, పేద కుటుంబం అన్న తేడా లేకుండా అందరూ ఫ్రిజ్‌ను నిత్యవసర వస్తువుగా ఉపయోగిస్తున్నారు.
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మాంసం, చాక్లెట్లు, గుడ్లు, పచ్చళ్లు, పిండ్లు, మిగిలిపోయిన వంటలు ఇలా వేటిని పడితే వాటిని ఫ్రిజ్‌లోకి తోసేయడం చాలా మందికి ఉన్న అలవాటు.అయితే వేటినైనా ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు అని నమ్మడం చాలా పొరపాటు.
ఎందుకంటూ.కొన్ని కొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఫ్రిజ్‌లో పెట్టకూడని వాటిలో టమాటాలు ఒకటి.
అయితే చాలా మందికి కిలోలు కిలోలు టమాటాలను తెచ్చుకున్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకునే అలవాటు ఉంటుంది.కానీ, ఇలా చేయడం వల్ల టమాటాలు మెత్తగా, నీరు పట్టినట్లు ఉబ్బిపోతాయి.
మరియు టమాటాల్లో రుచి మరియు పోషకాలు రెండూ తగ్గుతాయి.కాబట్టి, అవసరాన్ని బట్టే టమాటాలను తెచ్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుండా వాడేసుకోవాలి.

అలాగే చాలా మంది తేనెను ఫ్రిజ్‌లో పెడుతుంటారు.కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.ఫ్రిజ్‌ను తేనెను స్టోర్ చేయడం వల్ల.గట్టిగా చక్కెర ముద్దలా తయారవుతుంది.అప్పుడు దాన్ని వాడటం కష్టతరం అవుతుంది.అందువల్ల, తేనెను బయట ఉంచి వాడటమే మంచిది.
కొన్ని కొన్ని పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు.అలాంటి వాటిలో పుచ్చ కాయ, అవకాడో, అరటి పండు, బెర్రీలు, సిట్రస్ పండ్లను ఫ్రిజ్‌లో పెడితే.
వాటి రుచితో పాటు పోషకాలు కూడా తగ్గుముఖం పట్టే అవకావాలు చాలా ఎక్కువ.
అలాగే పుదీనాను కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదు.
చాలా మంది ఫ్రిజ్‌లో ఉండే పుదీనా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందని భావించారు.కానీ, ఇది నిజం కాదు.
పుదీనా ఫ్రిజ్‌లో ఉంటే రుచి, వాసన తగ్గడంతో పాటు ఆకులు కూడా నల్లగా మారిపోతాయి.
.