కెనడా : యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా( Canada ) ఒకటి.చదువులు, ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రతి యేటా లక్షల మంది భారతీయు కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు.

 Gurdaspur-origin Man Amanjot Singh Pannu Nominated To Senate By Alberta Governme-TeluguStop.com

దీంతో ఈ దేశంలో ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.

కెనడాకు దగ్గరవుతున్నారు.ఇక కెనడాలోనూ భారతీయులు విద్యావేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.

తాజాగా కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్ ప్రభుత్వం .భారత సంతతికి చెందిన మీడియా ప్రొఫెషనల్ అమన్‌జోత్ సింగ్ పన్నూని ( Professional Amanjot Singh Pannu )కాల్గరీ యూనివర్సిటీ సెనేటర్‌గా నామినేట్ చేసింది.ఈ యూనివర్సిటీ కెనడాలో ఎనిమిదో అతిపెద్దది, అల్బెర్టా సాంకేతిక విద్యా శాఖ మంత్రి రాజన్ సాహ్నీ.అమన్‌జోత్‌ను నామినేట్ చేశారు .పన్నూ పదవీకాలం జూలై 1 నుంచి మూడేళ్ల పాటు కొనసాగుతుంది.మొత్తం 62 మంది సభ్యులున్న యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌‌లో పంజాబీ మూలాలున్న, తలపాగా ధరించిన మూడవ సెనేటర్‌‌గా పన్నూ నిలిచారు.

Telugu Amanjotsingh, Canada, Gurdaspurorigin, Conservative-Telugu Top Posts

అమన్‌జోత్ ప్రస్తుతం కెనడా షాడో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ జస్రాజ్ సింగ్ హలన్‌కు( Jasraj Singh Halan ) ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే కాల్గరీ పంజాబీ మీడియా విభాగంలోనూ పనిచేస్తున్నారు.ఆయన స్వస్థలం పంజాబ్‌లోని గురుదాస్‌‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్‌‌‌లోని సర్ఫ్‌కోట్ గ్రామం.ఈ సందర్భంగా అమన్‌జోత్ మాట్లాడుతూ.లోకల్ కమ్యూనిటీతో కలిసి పంజాబ్ విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ కాల్గరీ ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.కాల్గరీ యూనివర్సిటీలో దాదాపు 36000 మంది విద్యార్దులు చదువుతున్నారు.

సెనేటర్‌గా అమన్‌జ్యోత్ నియామకంపై ప్రవాస భారతీయులు, పంజాబీ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.

Telugu Amanjotsingh, Canada, Gurdaspurorigin, Conservative-Telugu Top Posts

కాగా.గతేడాది అల్బెర్టా ప్రావిన్స్‌లో జరిగిన ఎన్నికల్లో పంజాబీ కమ్యూనిటికీ చెందిన నలుగురు అభ్యర్ధులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.కాల్గరీ, ఎడ్మంటన్‌లలో పోటీ చేసిన మొత్తం 15 మంది పంజాబీ అభ్యర్ధులలో నలుగురు ప్రజల ఆమోదాన్ని పొందారు.

యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ (యూసీపీ) నుంచి కేబినెట్ మంత్రిగా వున్న రాజన్ సాహ్నీ కాల్గరీ నార్త్ వెస్ట్‌లో న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ)కి చెందిన మైఖేల్ లిస్బోవా స్మిత్‌ను ఓడించి విజయం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube