జూనియర్ ఎన్టీఆర్ తెలుగు భాషలో ఉండటం మన అదృష్టం.. జోష్ రవి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే.చిరంజీవి విశ్వంభర సినిమాతో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

 Josh Ravi Comments About Junior Ntr Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవికి, కులం, మతం, భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు.జోష్ రవి ( Josh Ravi )చిరంజీవి గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రవితేజతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలనేది నా కోరిక అని జోష్ రవి తెలిపారు.బలుపు, క్రాక్, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలలో నేను నటించానని ఆయన పేర్కొన్నారు.

రవితేజ మాట్లాడే విధానం ఎంతో ఎనర్జీని అందిస్తుందని జోష్ రవి చెప్పుకొచ్చారు.చిరంజీవి, రవితేజ అంటే నాకు ఎంతో అభిమానమని ఆయన పేర్కొన్నారు.

నా పేరు మీద నాకే తెలియకుండా ఆరు అకౌంట్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Josh Ravi, Josh Ravi Ntr, Ntr, Kgf, Chiranjeevi-Movie

కేజీఎఫ్ సిరీస్ ( KGF series )సినిమాలు నాకు ఎంతో నచ్చాయని జోష్ రవి చెప్పుకొచ్చారు.రాజమౌళి, ప్రశాంత్ నీల్ తమ స్టైల్ తో మెప్పిస్తున్నారని ఆయన అన్నారు.సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి నటనను ఇష్టపడ్డామే తప్ప వాళ్ల కులాన్ని కాదు కదా అని జోష్ రవి వెల్లడించారు.

జై లవకుశ సమయంలో ఆ సినిమా గురించి పాజిటివ్ గా పోస్ట్ పెడితే కొంతమంది నాపై నెగిటివ్ కామెంట్స్ చేసారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Josh Ravi, Josh Ravi Ntr, Ntr, Kgf, Chiranjeevi-Movie

చిరంజీవి తర్వాత చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం అని జోష్ రవి తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ తెలుగు భాషలో ఉండటం మన అదృష్టం అని ఆయన వెల్లడించారు.త్రివిక్రమ్ గారు నేను శివుని గురించి రాసినవి చూసి ప్రోత్సహించారని జోష్ రవి తెలిపారు.

జోష్ రవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube