ఇండియన్2 మూవీ డిజాస్టర్లకే డిజాస్టర్.. శంకర్ కూడా ఆ దర్శకుల జాబితాలో చేరారుగా!

శంకర్, కమల్ హాసన్ ( Shankar, Kamal Haasan )కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన సినిమా ఇండియన్ 2( Indian 2 ).భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

 Indian 2 Joins All Time Disaster List, Indian 2, Disaster List, Tollywood, Movie-TeluguStop.com

కాగా కొన్ని వారాల ముందు వరకు పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా భావించిన సినిమా.కానీ రిలీజ్ టైంకి ఈ చిత్రానికి సొంత భాష తమిళ సహా ఎక్కడా పెద్దగా హైప్ కనిపించలేదు.

అయినా సరే శంకర్, కమల్ హాసన్ లాంటి కాంబినేషన్ లో వందల కోట్లు పెట్టి తీసిన సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు.

Telugu Disaster List, Indian, Indianjoins, Disaster, Tollywood-Movie

ఆ నమ్మకంతోనే థియేటర్లకు వెళ్లిన వారికి చుక్కలు కనిపించాయి.కంటెంట్ లేకుండా ఊరికే సాగదీసి మూడు గంటల పాటు ప్రేక్షకులను విసిగించేశాడు శంకర్.విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ మొదలయ్యింది.

ఆ నెగటివ్ టాక్ వసూళ్లపై బాగానే ప్రభావం చూపించింది.ఈ సినిమా తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని థియేటర్లో దద్దరిల్లిపోతాయని అందరూ ఊహించుకున్నారు.

కానీ వీకెండ్లోనే ఈ చిత్రం నిలబడలేకపోయింది.ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 30 శాతం లోపే ఉండడం ఇందుకు గమనార్హం.

తమిళనాడు సహా ఎక్కడా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.అలాగే వీకెండ్ అయ్యాక ఇండియన్ 2 పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

Telugu Disaster List, Indian, Indianjoins, Disaster, Tollywood-Movie

మినిమం ఆక్యుపెన్సీలు లేక బాక్సాఫీస్ దగ్గర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది.వరల్డ్ వైడ్ సోమవారం అన్ని భాషల్లో కలిపి కూడా సినిమాకు పది కోట్ల గ్రాస్ రాని పరిస్థితి.ఇక తమిళనాడులో అయితే సోమవారం 2 కోట్ల గ్రాస్ కూడా వసూలు కాలేదు.ఆక్యుపెన్సీ కూడా 20 శాతం కూడా లేని పరిస్థితి.తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్-2 పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని చెప్పవచ్చు.ఏపీలో కానీ, తెలంగాణలో కానీ విడివిడిగా కోటి రూపాయల గ్రాస్ కూడా రాలేదు.

వీకెండ్ తర్వాత తెలుగు ఆడియన్స్ పూర్తిగా ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.ఇక నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాను థియేటర్లలో నడిపిస్తే షేర్ అంటూ ఏమీ వచ్చేలా లేదు.

మెయింటైనెన్స్ ఖర్చులకు కూడా డబ్బులు రాని పరిస్థితి.ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే డిజాస్టర్ లకే డిజాస్టర్ గా ఈ సినిమా నిలుస్తుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube