ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు రాణిస్తున్న విషయం తెలిసిందే.ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా సినిమాలు చూస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
మరి అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ( Janhvi Kapoor )సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు నాని సరసన కూడా నటించడానికి సిద్ధమవుతోంది అని తెలుస్తోంది.మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.అలాగే తొలి తెలుగు సినిమా విడుదలకు ముందే మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ బోర్సే( Bhagyashree Borse ).క్యాడ్బరీ యాడ్ తో పాపులర్ అయిన ఈమె యారియాన్ 2 సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తోంది.
అలాగే విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యింది.దుల్కర్ సల్మాన్ హీరోగా కొత్త దర్శకుడు రవి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను కథానాయికగా తీసుకోబోతున్నట్టు సమాచారం.

అలాగే ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న వారిలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) కూడా ఒకరు.ఈమె ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అలాగే ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.హీరోయిన్ ప్రియాంక మోహన్ ( Priyanka Mohan )ప్రస్తుతం ఓజీ అలాగే సరిపోదా శనివారం సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు, తమిళ్లో రవి సరసన బ్రదర్ లో సందడి చేయనున్నారు.అలాగే రష్మిక కూడా ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.
పుష్ప 2 సినిమాతో పాటు మరో నాలుగు ఐదు ప్రాజెక్టులలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న అనుపమ ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తోంది.







