చైనా( China )లో ఒక మహిళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ టెక్నాలజీ పుణ్యమా అని బయటపడింది.33 ఏళ్ల జింగ్ అనే వ్యక్తి తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానించాడు.ఆమె ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడం జింగ్ను ఆందోళనకు గురిచేసింది.తన భార్య ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అతను డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఆమెను గూఢచర్యం చేయడం ప్రారంభించాడు.
డ్రోన్ ద్వారా భార్యను ట్రాక్ చేయడం ద్వారా, జింగ్ ఒక షాకింగ్ వాస్తవాన్ని తెలుసుకున్నాడు.అదేంటంటే అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.జింగ్, అతని భార్య ఇద్దరూ ఉద్యోగులు.వీళ్లు సెంట్రల్ హుబే ప్రావిన్స్( Hubei Province )లోని జియాన్కు చెందినవారు.
![Telugu Boss, China, Drone, Nri-Telugu NRI Telugu Boss, China, Drone, Nri-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/07/China-Drone-cheating-wife-husband-boss-Technology-NRI-news-Jing-social-media.jpg)
డ్రోన్( Drone )తో తీసిన వీడియోలో జింగ్ భార్య కారు ఎక్కి, పర్వతాల దగ్గర ఉన్న పాత ఇంటి వరకు వెళ్లడం కనిపించింది.ఆ ఇంటి నుంచి ఆమె బయటకు వచ్చినట్లు వీడియో ద్వారా తెలుసుకున్నాడు, ఆమె తన ఆఫీస్ బాస్ చేతిలో చేయి వేసి పాత ఇంటి లోపలికి వెళ్లడం కూడా వీడియోలో కనిపించింది.20 నిమిషాల తర్వాత వారు బయటకు వచ్చి, ఫ్యాక్టరీకి వెళ్లారు.
![Telugu Boss, China, Drone, Nri-Telugu NRI Telugu Boss, China, Drone, Nri-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/07/China-Drone-cheating-wife-Technology-NRI-news.jpg)
ఈ వీడియో చూసిన జింగ్ షాక్కు గురయ్యాడు.వెంటనే విడాకులకు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.డ్రోన్ ద్వారా దొరికిన వీడియో ఆధారంగా భార్య నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పాడు.
గత ఏడాది నుంచి భార్య ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పు జింగ్ను ఇబ్బంది పెడుతోంది.ఆమె మునుపు చాలా కేర్ చూపించేది కానీ, ఇప్పుడు తరచూ తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఒంటరిగా బయటకు వెళ్లేది.
అయితే ఈ న్యూస్ విన్న చాలామంది నెటిజన్లు భర్త పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి డ్రోన్ కొనడం ఒక మంచి ఐడియా అనుకుంటా అని సరదాగా కామెంట్ చేశాడు.
ఈ టెక్నాలజీ యుగంలో అబద్ధాలు ఎంతో కాలం దాచలేమని, అందుకే నిజాయితీగా బతకడమే మంచిదని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.