ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకున్న సూర్య.. గ్రేట్ అంటూ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్య( Surya )కు మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.సూర్య ప్రస్తుతం నటిస్తున్న కంగువా సినిమా( Kanguva )పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా సూర్య ఈ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిమానులు నమ్ముతున్నారు.

 Star Hero Surya Blood Donation Details Here Goes Viral In Social Media , Surya-TeluguStop.com

సూర్య తాజాగా చేసిన ఒక పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకోవడం ద్వారా సూర్య వార్తల్లో నిలిచారు.

Telugu Suriya Donates, Fans, Kanguva, Kollywood, Surya-Movie

తమిళనాడు రాష్ట్రంలో సూర్యకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టినరోజు( Surya birthday ) కావడంతో అభిమానులు ఇప్పటినుంచే సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు.సూర్య బర్త్ డే సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు.ఈ విషయం తెలిసి అప్పట్లో సూర్య చలించిపోయారు.

Telugu Suriya Donates, Fans, Kanguva, Kollywood, Surya-Movie

ఈ ఏడాది జరిగే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని మాట ఇచ్చిన సూర్య ఆ మాటను ఎట్టకేలకు నిలబెట్టుకుని వార్తల్లో నిలిచారు.చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఫ్యాన్స్ తో పాటు సూర్య రక్తదానం చేయగా 500 మంది అభిమానులు సైతం రక్తదానం చేసినట్టు సమాచారం అందుతోంది.సూర్య చేసిన మంచి పనిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

సూర్య రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూర్య కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సూర్య రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube