ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకున్న సూర్య.. గ్రేట్ అంటూ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్య( Surya )కు మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.

సూర్య ప్రస్తుతం నటిస్తున్న కంగువా సినిమా( Kanguva )పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా సూర్య ఈ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిమానులు నమ్ముతున్నారు.

సూర్య తాజాగా చేసిన ఒక పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకోవడం ద్వారా సూర్య వార్తల్లో నిలిచారు.

"""/" / తమిళనాడు రాష్ట్రంలో సూర్యకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టినరోజు( Surya Birthday ) కావడంతో అభిమానులు ఇప్పటినుంచే సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు.

సూర్య బర్త్ డే సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు.

ఈ విషయం తెలిసి అప్పట్లో సూర్య చలించిపోయారు. """/" / ఈ ఏడాది జరిగే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని మాట ఇచ్చిన సూర్య ఆ మాటను ఎట్టకేలకు నిలబెట్టుకుని వార్తల్లో నిలిచారు.

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

ఫ్యాన్స్ తో పాటు సూర్య రక్తదానం చేయగా 500 మంది అభిమానులు సైతం రక్తదానం చేసినట్టు సమాచారం అందుతోంది.

సూర్య చేసిన మంచి పనిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.సూర్య రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూర్య కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సూర్య రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు.

ఇండియన్2 మూవీ డిజాస్టర్లకే డిజాస్టర్.. శంకర్ కూడా ఆ దర్శకుల జాబితాలో చేరారుగా!