బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi kapoor ) గురించి మనందరికీ తెలిసిందే.దివంగత హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది.
టాలీవుడ్ బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే త్వరలోనే ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara )తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.జాన్వి కపూర్ నటిస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా కావడం ఇదే విశేషం.ఇక జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం కూడా తెలుగు అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూశారు.ఇది ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా ఇంకా విడుదల కాకముందే ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న సినిమాకు ఓకే చేసేసింది.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ మరో సినిమాకు సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది.
హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించే సినిమాకు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.దసరా సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇదే.దసరా నువ్వు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడంతో శ్రీకాంత్ కు మరొక అవకాశం ఇచ్చారు నాని.ఈ సినిమా కూడా భారీ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.అందుకే జాన్వీ ని హీరోయిన్ గా తీసుకుంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ఆలోచనతోనే జాన్వి ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా( Saripodhaa Sanivaaram ) చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట.