పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఆలీ( Ali ) ఒకరు.బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి మెప్పించారు.

 Comedian Ali Shocking Comments On Pawan Kalyan Details,ali,pawan Kalyan,suma Add-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించిన ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే అలీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోకి( Politics ) కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Ali, Janasena, Pawan Kalyan, Ravi Teja, Suma Adda, Ysr Congress-Movie

ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress Party ) మద్దతుగా తెలియచేయడమే కాకుండా గత ప్రభుత్వ హయామంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పనిచేశారు.ఇక ఈసారి ఎన్నికలలో ఆలీ ఎక్కడ చురుగ్గా పాల్గొనలేదు.అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నానని నేను ఒక సాధారణ వ్యక్తి లాగా తన ఓటు హక్కును మాత్రమే వినియోగించుకుంటానని, నేను ఏ రాజకీయ పార్టీలకు మద్దతు తెలపనని పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వచ్చారు.

Telugu Ali, Janasena, Pawan Kalyan, Ravi Teja, Suma Adda, Ysr Congress-Movie

ఈ విధంగా అలీ రాజకీయాల నుంచి తప్పుకొని తన వృత్తిపరమైన జీవితంలో కొనసాగుతూ ఉన్నారు.అయితే ఇటీవల సుమ( Suma ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా( Suma Adda ) అనే కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే సందడి వాతావరణం నెలకొంది.

అయితే సుమ అలీను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తావన తీసుకువచ్చారు.మీరు ఈ హీరోలలో ఎవరితో చాలా కంఫర్టబుల్ గా నటించడానికి ఇష్టపడతారు.

ఒకటి రవితేజ( Raviteja ) రెండు పవన్ కళ్యాణ్ అనే ఆప్షన్ ఇచ్చారు.ఇక ఈ ప్రశ్నకు ఆలీ ఏ మాత్రం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ అంటేనే చాలా ఇష్టంగా నటిస్తాను అంటూ సమాధానం చెప్పారు.

దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube