వైరల్ వీడియో: మాజీ మంత్రి రోజా తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. మ్యాటరేంటంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా( EX Minister Roja ) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత ఆవిడ పెద్దగా ఎక్కడ మీడియా ముందుకు రాలేదు.

 Ex Minister Roja Behaviour With Sanitation Workers Video Viral On Social Media D-TeluguStop.com

కొద్దిరోజుల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఆవిడ కనపడింది.తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తన భర్తతో కలిసి దర్శనం చేసుకుంటుంది.

అయితే తాజాగా ఓ ఆలయంలో( Temple ) రోజా నడుచుకున్న తీరు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురిచేస్తుంది.

ఓ గుడిలో ఇద్దరు మహిళలు సెల్ఫీ( Selfie ) తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో రోజా ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.రోజా పారిశుద్ధ కార్మికులను( Sanitation Workers ) దూరంగా నిల్చి ఉన్నట్లుగా వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.దీంతో రోజా తీరుపై అనేకమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సోమవారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని సుబ్రమణ్య స్వామి గుడిలో( Subrahmanya Swamy Temple ) వరుణాభిషేకంలో ఆవిడ పాల్గొంది.ఆమెతోపాటు ఆయన భర్త కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అభిషేకం తర్వాత స్వామివారిని దర్శించుకుని ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి వెలుపలకి వెళ్లే సమయంలో అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రయత్నం చేశాడు.

దీంతో ముందుగా రోజా ఆలయంలో భక్తులందరిని నవ్వుతూ పలకరించి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.అంతేకాదు వారితో క్లోజ్ గా నిలబడేందుకు కూడా అనుమతి ఇచ్చింది.కాకపోతే పారిశుద్ధ మహిళా కార్మికులు మాత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దూరంగా నిలుచొమంటూ వారికి రోజా సైగలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

దాంతో ఆ మహిళలు చేసేదేమీ లేక రోజాకు కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు.ఇక ఈ వీడియోని చూసిన చాలామంది పారిశుద్ధ కార్మికుల అంటే నీకు అంత చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube