ఒక సినిమా రిలీజ్ అవ్వకుండానే మరి కొన్ని ఆఫర్స్ దక్కించుకున్న హీరోయిన్స్ వీరే !

మామూలుగా ఒక మంచి నటి దొరకడం ఇండస్ట్రీలో ఇప్పుడు కష్టమైపోయింది.చాలామంది మేము నటిస్తాము అని వస్తారు కానీ ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు.

 These Heroines Grab Movies Without Releasing First Movie Janhvi Kapoor Bhagyashr-TeluguStop.com

పైగా హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ.మూడు నాలుగు ఏళ్లలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రతిసారి కొత్త హీరోయిన్స్ వేట మొదలవుతూనే ఉంటుంది.

ఇప్పటి తరంలో పదేళ్లు లేదా 20 ఏళ్లు సినిమాల్లో నటించే హీరోయిన్స్ అస్సలు లేరు.నయనతార, త్రిష లాంటి హీరోయిన్స్ మళ్ళీ వస్తారు అనుకోవడం పొరపాటే.

అయితే కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు తమ సినిమాల ద్వారా అతి త్వరలో ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నారు.కానీ మొదటి సినిమా విడుదల అవ్వకుండానే అంత కన్నా మంచి సినిమా ఆఫర్స్ కూడా దక్కించుకుంటున్నారు .మరి ఆ హీరోయిన్స్ ఎవరు ? వారు నటిస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జాన్వి కపూర్

Telugu Bangarraju, Devara, Grab, Janhvi Kapoor, Krithi Shetty, Bachchan, Ram Cha

శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్( Janhvi Kapoor ) తొలిసారిగా దేవర సినిమాతో( Devara ) టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టబోతోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.అయితే మొదటి సినిమా విడుదలవ్వకుండానే ఆమెకు నాని మరియు రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించే అవకాశం దక్కింది.అది త్వరలో ఈ సినిమాలో కూడా పట్టాలేకబోతున్నాయి.

భాగ్యశ్రీ బోర్సే

Telugu Bangarraju, Devara, Grab, Janhvi Kapoor, Krithi Shetty, Bachchan, Ram Cha

మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) సినిమా ద్వారా భాగ్యశ్రీ( Bhagyashri Borse ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.ఈ సినిమా విడుదల అవకుండానే విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ సినిమాలలో ఆమెకు ఆఫర్స్ వచ్చాయి.అతి త్వరలో ఇవి సెట్స్ పైకి వెళ్ళనున్నాయి.

కృతి శెట్టి

Telugu Bangarraju, Devara, Grab, Janhvi Kapoor, Krithi Shetty, Bachchan, Ram Cha

ఆతి చిన్న వయసులో టీనేజ్ లో ఉండగానే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి శెట్టి.( Krithi Shetty ) అయితే ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలవడానికి ఆలస్యమైంది పైగా ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆమెకు శ్యాం సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమా ఆఫర్స్ వచ్చాయి.అలా ఈ మూడు సినిమాలు కూడా ఆమె నటించగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోయిన్ గా కృతి నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube