చైనాలో వ్లాగ్ చేస్తూ అతి చేసిన భారతీయ యువతి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..?

తాజాగా ఒక ఇండియన్ లేడీ యూట్యూబర్ చైనాలో( China ) ఓ పిచ్చి పని చేసి వివాదంలో చిక్కుకుంది.ఆమె పేరు జ్యోతి మల్హోత్ర.

 Indian Youtuber In China Sparks Outrage With Controversial Travel Vlog Viral Vid-TeluguStop.com

( Jyoti Malhotra ) ట్రావెలింగ్ చేసే ఈ యువతి ఇటీవల చైనాలో తిరగడం మొదలుపెట్టింది.అక్కడి చూడదగ్గ ప్రదేశాలను డాక్యుమెంట్ చేస్తూ ఆమె తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోలో, జ్యోతి స్థానిక నిబంధనలను ఉల్లంఘించడం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది.

ఈ వీడియో ప్రకారం జ్యోతి షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లే బుల్లెట్ ట్రైన్ లో( Bullet Train ) ప్రయాణించింది.

ఆమెకు కిటికీ సీటు దొరకలేదు.వెంటనే, ఆమె తన సహ ప్రయాణికుడిని “చైనీస్ బ్రదర్ “ అని పిలుస్తూ రెండో సీట్ కావాలంటూ అందులో కూర్చున్న వ్యక్తిని లేపి పక్కన కూర్చోబెట్టింది.

గందరగోళానికి గురైన ప్రయాణికుడు ఆమె మాటకు బదులు చెప్పలేక మధ్య సీటుకు మారాడు.ఆపై జ్యోతి స్కూటర్‌ను( Scooter ) నడుపుతున్న వ్యక్తి నుంచి బలవంతంగా స్కూటర్‌ను లాక్కుని, రోడ్డుపై వెళ్తుంది.

బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కూడా ఆమె నిబంధనలను పాటించకుండా ప్రవర్తిస్తుంది.

వీడియోలో మరిన్ని దారుణమైన సంఘటనలు ఆమె చేయడం మనం చూడవచ్చు.జ్యోతి రోడ్డు మధ్యలో ఉన్న ఒక మహిళ స్కూటీపై ఎక్కుతుంది.ఆ మహిళ తాను వేరే దారిలో వెళ్తున్నానని చెప్పినా, జ్యోతి వదలకుండా వేధిస్తుంది.

చివరికి ఆ మహిళ పోలీసు సహాయం కోరుతుంది, కానీ జ్యోతి హిందీలో మాట్లాడుతూ వీడియో తీయడం కొనసాగిస్తుంది.ఆ తర్వాత, జ్యోతి ఒక బస్సు ఎక్కి, టిక్కెట్ కొనమని డ్రైవర్ చెప్పినా పట్టించుకోకుండా తన సీటుకు వెళ్తుంది.

తరువాత ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు దిగాలని అరుస్తూ డ్రైవర్‌తో వాదించడం మొదలుపెడుతుంది.బస్సులు నిర్దిష్ట స్టాప్‌ల వద్దే ఆగుతాయని డ్రైవర్( Driver ) చెప్పినా ఆమె వినదు.

ఈ వీడియో అంతటా జ్యోతి స్థానిక ప్రజల గురించి తేలికగా మాట్లాడుతూ ఉంటుంది.ఆమె హిందీ లేదా ఇంగ్లీషులో మాట్లాడటం వల్ల స్థానిక ప్రజలకు అర్థం కాక పరిస్థితి మరింత దిగజారింది.ఈమె వీడియోను షేర్ చేస్తూ “అధిక కులం యూట్యూబర్ కమాండింగ్ టోన్‌లో కిటికీ సీటు అడుగుతుంది.ఒక వృద్ధ మహిళ స్కూటీని బలవంతంగా ఎక్కి, ఆమెను వ్యతిరేక దిశలో ప్రయాణించమని కోరుతుంది.

బస్సును బలవంతంగా ఆపి, నాణేలు లేకుండా రెండుసార్లు బస్సు ఎక్కింది, డ్రైవర్‌ను స్టేషన్ కాని ప్రదేశంలో ఆపమని కోరుతుంది” అని ఓ ఎక్స్‌ యూజర్ క్యాప్షన్ పెట్టారు.అయితే చాలామంది ఆమె బిహేవియర్ ను తిట్టిపోశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube