కురులకు కొండంత అండగా నిలిచే కుంకుడు కాయలు.. ఇలా వాడితే అదిరిపోయే లాభాలు!

ఇప్పుడంటే హెయిర్ వాష్( Hair Wash ) చేసుకోవడానికి రకరకాల షాంపూలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.వేలల్లో కాదు లక్షలు ఖరీదు చేసే షాంపూలను కూడా తీసుకొస్తున్నారు.

 Amazing Benefits Of Soap Nuts For Hair Details, Soap Nuts, Soap Nuts Benefits, H-TeluguStop.com

కానీ ఒకప్పుడు అందరూ జుట్టును శుభ్రం చేసుకునేందుకు కుంకుడు కాయల్ని వాడేవారు.కుంకుడు కాయల్లో( Soap Nuts ) యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

అందువల్ల కురుల ఆరోగ్యానికి కుంకుడు కాయలు కొండంత అండగా నిలుస్తాయి.

Telugu Dandruff, Breakage, Care, Care Tips, Fall, Healthy, Hibiscus, Latest, Soa

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కుంకుడు కాయలను వాడితే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.మనలో చాలా మంది హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు రెండు గ్లాసుల కుంకుడు రసంలో రెండు టేబుల్ స్పూన్లు మెంతి పిండి( Fenugreek Powder ) వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత ఈ కుంకుడు రసాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా తలస్నానం చేస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు విరగడం చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

Telugu Dandruff, Breakage, Care, Care Tips, Fall, Healthy, Hibiscus, Latest, Soa

అలాగే చుండ్రు సమస్యతో( Dandruff ) బాధపడుతున్న వారికి కుంకుడు కాయలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.కుంకుడు కాయలతో చాలా అంటే చాలా సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు.అందుకోసం కుంకుడు కాయల రసంలో మెత్తగా నూరిన నాలుగు మందార ఆకులు( Hibiscus Leaves ) వేసి కలపాలి.ఇప్పుడు ఈ కుంకుడు రసంతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

కుంకుడు కాయలు మరియు మందారం కాంబినేషన్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా చుండ్రు మొత్తాన్ని సులభంగా తొలగిస్తుంది.

స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తుంది.కాబట్టి ఇకపై వేలకు వేలు షాంపూల కోసం తగలేయడం మానేసి కుంకుడు కాయలతో తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి.

ఆరోగ్యమైన కురులను మీ సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube