రోజుకో తమలపాకును ఈ విధంగా తింటే పొట్ట కొవ్వు దెబ్బకు మాయమవుతుంది!

బెల్లీ ఫ్యాట్( Belly Fat ) సమస్యతో బాధపడుతున్నారా.? పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? సన్నగా మారాలని ఆరాటపడుతున్నారా.? అయితే మీకు తమలపాకు ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.తమలపాకు( Betel Leaves ) అనగానే దాదాపు అందరికీ తాంబూలం గుర్తుకు వస్తుంది.అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా.పూజ జరిగినా.తమలపాకులు ఉండాల్సిందే.

 Eating Betel Leaves Like This Will Help You Lose Belly Fat Details, Belly Fat,-TeluguStop.com

ఆయుర్వేద వైద్యంలోనూ తమలపాకులను వినియోగిస్తారు.తమలపాకు ఎంతో శక్తివంతమైన ఆకు.ఆరోగ్యపరంగా మనకు తమలపాకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ఎన్నో జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.

పొట్ట కొవ్వును కరిగించే సత్తా కూడా తమలపాకుకు ఉంది.అందుకోసం తమలపాకును ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకుని తొడిమ‌ తొలగించాలి.ఆ తర్వాత తమలపాకులో నాలుగు నుంచి ఐదు మిరియాలు( Black Pepper ) పెట్టి చుట్టాలి.

ఇప్పుడు ఈ తమలపాకును నోట్లో వేసుకుని బాగా నమిలి తినేయాలి.చివరిగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.

ఈ విధంగా ప్రతి రోజు కనుక చేశారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Telugu Belly Fat, Betel Leaf, Betel, Betel Benefits, Black Pepper, Fat Remedy, T

తమలపాకు మరియు మిరియాల కాంబినేషన్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది.బాన పొట్టను కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుస్తుంది.పొట్టను తగ్గించుకొని నాజుగ్గా మారాలనుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా తమలపాకును తీసుకోండి.

పైగా తమలపాకులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది.

Telugu Belly Fat, Betel Leaf, Betel, Betel Benefits, Black Pepper, Fat Remedy, T

అందువల్ల తమలపాకును నిత్యం తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.తమలపాకులో అనేక యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి.ఇవి నోటి దుర్వాసన, దంతాల పసుపు, ఫలకం మరియు దంత క్షయం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొంద‌వ‌చ్చు.మ‌రియు శరీరం మరియు మనస్సుకు త‌మ‌ల‌పాకు చ‌క్క‌టి విశ్రాంతిని సైతం అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube